సిర్పూర్ టి బస్టాండ్ నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించండి

20-11-2026 | 10:21pm

టి జి ఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ కు వినతి పత్రం

కాగజ్ నగర్, నవంబర్ 20 ( విజయక్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) సిర్పూర్ టి మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించాలని ఆల్ ఇండియా మహిళ కాంగ్రెస్  నేషనల్(All India Mahila Congress National) సెక్రెటరీ బి. అదిత కోరారు. శుక్రవారం హైదరాబాదులో టీజిఎస్ఆర్టిసి(TGSRTC) వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ కు ఆమె వినతి పత్రం అందజేశారు. దశాబ్దాల కాలంగా బస్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇందుకోసం త్వరగా టెండర్లు పూర్తిగా గావించి, పనులు ప్రారంభించాలని అదిత వైస్ చైర్మన్ ను  కోరారు.

మరిన్ని వార్తలు