జవహర్ నగర్ వాసులకు న్యాయం చేయాలి

20-11-2026 | 10:15pm

గ్రామ కంఠం పరిధిలో... నివసిస్తున్న అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయండి.                 

జిల్లా కలెక్టర్ ను కోరిన డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ తదితరులు.                           

జవహర్ నగర్, నవంబర్ 20 (విజయక్రాంతి): జవహర్ నగర్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా నివాస ఉంటున్న పేద కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయండి అని గ్రామకంఠం పరిధిలో నివసిస్తున్న అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses) మంజూరు చేయండి అని మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు వజ్రేష్  యాదవ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరిని(Medchal District Collector Manu Chowdary) కోరారు.

జవహర్ నగర్ గ్రామకంఠం 330 ఎకరాల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఎన్నో ఏళ్లుగా జవహర్ నగర్ లో నివాసముంటున్న పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ జవహర్ నగర్ గ్రామకంఠం పరిధిలోని 330 ఎకరాల్లో నివాసం ఉంటున్న వారికి గతంలో రెవెన్యూ శాఖ మంత్రి దేవేందర్ గౌడ్ హయాంలో జారీ చేసిన పట్టాలు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించిన తెలంగాణ పట్టాలు డోర్ నెంబర్లు విద్యుత్ బిల్లుల వంటి ఆధారాలు ఉన్న కుటుంబాలన్నింటినీ అర్హులుగా పరిగణించి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయాలని కోరారు.

గ్రామ కంఠం పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ఇంటి నిర్మాణాల కోసం మున్సిపల్ అనుమతులు మంజూరు చేయాలని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రజాసమస్యలు అభివృద్ధి పనులు ప్రజలు ఎదురవుతున్న ఇబ్బందులపై కలెక్టర్ తో చర్చించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులు, జవహర్ నగర్ కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు