తెలంగాణలో ‘వీబీఎన్’ విస్తరణ
హైదరాబాద్‌లో ఫౌండర్స్ డే, ఆల్ చాప్టర్స్ మీట్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాం తి): హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న హెచ్ఐసీసీ నోవోటెల్లో(HICC Novotel) మంగళవారం వైశ్య బిజినెస్ నెట్వర్క్ (వీబీఎన్) ఆధ్వర్యంలో ఫౌండర్స్ డే అండ్ ఆల్ చాప్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీబీఎన్కు చెందిన వివిధ చాప్టర్ల నుంచి 400 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి నిపుణులు హాజరయ్యారు.
ఎమ్మడి శివకుమార్ స్థాపించిన వీబీఎన్ ప్ర స్తుతం హైదరాబాద్‌లో ఐదు చాప్టర్లు, నిజామాబాద్‌లో ఒక చాప్టర్‌తో బిజినెస్ నెట్వర్కింగ్ వేదికగా కొనసాగుతోంది. ఒక్కో చాప్టర్లో 70 మంది వరకు విభిన్న రంగాలకు చెందిన వ్యాపార యజమానులు ఉన్నారు. ప్రస్తుతం వరంగల్, సిద్దిపేటలో కూడా వీబీఎన్ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సందర్భం గా వీబీఎన్ వ్యవస్థాపకులు ఎమ్మడి శివ కు మార్ మాట్లాడుతూ.. వ్యాపార యజమానులను ఒకే వేదికపైకి తీసుకురావడం,
అర్థవంతమైన పరిచయాలను ఏర్పరచడం, ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి చెం దేలా చేయడం అనే లక్ష్యంతో వీబీఎన్ను ప్రారంభించాం. ఫౌండర్స్ డే కార్యక్రమానికి 400 మందికి పైగా పారిశ్రామికవేత్తలు హాజరవడం వీబీఎన్ కమ్యూనిటీ బలాన్ని తెలియజేస్తోంది అన్నారు. అపెక్స్ చైర్మన్ రాధాకృష్ణ, అపెక్స్ సెక్రటరీ సాయిచంద్, వీరేష్ జూలూరి, అపెక్స్ సోషల్ కోఆర్డినేటర్ మొగడంపల్లి శంకర్ పాల్గొన్నారు.