విజ్ఞాన్స్‌లో ‘క్లీన్ ఎనర్జీ’ జాతీయ సదస్సు

11-09-2026 | 04:25am

యాదాద్రి భువనగిరి జిల్లా దేశ్‌ముఖిలో నిర్వహణ

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ త రాల మనుగడ, సుస్థిర అభివృద్ధి సాధనకు సాంప్రదాయ ఇంధన వనరులను పక్కనపెట్టి క్లీన్ ఎనర్జీ(Clean Energy) వైపు వే గంగా మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్, మైసూర్‌లోని సీఎస్‌ఐఆర్‌సీఎఫ్‌టీఆర్‌ఐ మాజీ డైరెక్టర్ కేఎస్‌ఎంఎస్. రాఘవరావు స్పష్టం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో బయోటె క్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘హార్నెసింగ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ టు డ్రైవ్ సస్టైనబిలిటీ అండ్ కాంబ్యాట్ క్లైమేట్ ఛేంజ్ వరల్డ్‌వైడ్‘ అనే అంశంపై గురువారం మూడు రోజుల జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథి ప్రొఫెసర్ రాఘవరావు మా ట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు హరిత సాంకేతికతలు ఎంతో కీలకమన్నారు. 

గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న పండిత్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (పీడీఈయూ) ప్రొఫెసర్ రమేష్ కె. గుడూరు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి, కాలుష్య రహిత క్లీన్ ఎనర్జీ నిల్వ, ఉత్పాదక సాంకేతికతలను అభివృద్ధి చేయడం అత్యంత ప్రాధాన్య అంశమన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు