వక్ఫ్‌బోర్డు నిర్వీర్యం..

16-09-2026 | 04:25am

విలువైన వక్ఫ్ భూములకు నష్టం జరిగేలా సర్కార్ తీరు

సయ్యద్ లాయక్ అలీ

మలక్పేట్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): వక్ఫ్ బోర్డు పరిపాలనా వ్యవస్థను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి, విలువైన వక్ఫ్ భూములకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నాదని బీఆర్‌ఎస్ మలక్పేట నియోజకవర్గం జనరల్ సెక్రటరీ సయ్యద్ లాయక్ అలీ(BRS Malakpet Constituency General Secretary Syed Layaq Ali) ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి ఎంతో విలువైన ఆస్తులని, మతపరమైన మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయించిన భూములని అన్నారు. ఈ ఆస్తులను పరిరక్షించడం, సమర్థవంతంగా నిర్వహించడం వక్ఫ్ బోర్డు, ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు పనితీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. 

ఆక్రమణదారులు, ల్యాండ్ మాఫియా అనుకూలంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉందని, తద్వారా వక్ఫ్ ఆస్తులకు కోలుకోలేని నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు పరిపాలనా వ్యవహారాలను తక్షణమే సరిదిద్దాలని, బోర్డును సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వక్ఫ్ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అలస త్వాన్ని సహించేది లేదని సయ్యద్ లాయక్ అలీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టి వక్ఫ్ ఆస్తులను అక్రమ ఆక్రమణలు, ఇతర నష్టాల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు