చేప పిల్లలెక్కడ?

16-09-2026 | 05:25am

ఉచిత చేప పిల్లల పంపిణీకి గత నెల మూడోవారంలోనే టెండర్లు పూర్తి

ఈనెల మొదటివారంలో విడుదల చేయాలని సర్కార్ నిర్ణయం 

ఆగస్టులో 116 కోట్లు విడుదల

ఎల్ నినో ప్రభావంతో ఆలస్యమైన వర్షాలు 

నీళ్లు నిండిన చెరువుల్లోనైనా విడుదల చేయాలని కోరుతున్న మత్స్యకార సొసైటీలు

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మత్స్యకార(Fisherfolk) కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడానికి, జలాశయాల్లో మత్స్య సంపదను పెంచడానికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ(Distribution of fishlings)ని ప్రతి ఏటా చేపడుతున్నది. మత్స్యశాఖ(Department of Fisheries) ద్వారా రాష్ట్రంలోని చెరువులు, కుంటల(Tanks and ponds)లో చేప పిల్లలను(Fish fingerlings) వంద శాతం సబ్సిడీతో  వదులుతుంది. తద్వా రా  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ(Rural economy)ను బలోపేతం చేయడంతో పాటు కులవృత్తిని నమ్ముకున్న మత్స్యకారులకు ఉపాధి దొరుకు తున్నది.

అందుకు రాష్ట ప్రభుత్వం ఈ ఏడాదికి గాను (2026-27) ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రూ. 116 కోట్లు ఆగస్టు మొదటివారంలోనే విడుదల చేసింది. రాష్ట్రంలోని జలాశయాల్లో  90 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రోయ్య పిల్లల  పంపిణీకి సంబంధించిన టెండర్లను ఆగస్టులోనే  పిలిచారు. అందుకు 108 బిడ్ల వరకు వచ్చాయి. టెండర్లను కూడా ఆగస్టు మూడో వారంలో పూర్తిచేశారు. అయితే సెప్టెంబర్ మొదటివారంలో చేప పిల్లలు వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. కానీ, సెప్టెంబర్ రెండోవారం పూర్తయినా.. ఉచిత చేప పిల్లల పంపిణీపై మత్స్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రతి ఏటా జూన్, జూలై నెలల్లోనే టెండర్లు పిలుస్తుండగా, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా లేక చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి తగినంత నీరు చేరకపోవడంతో పథకం అమలుపై మొదట్లో కొంత సందిగ్ధం ఏర్పడింది. అయితే జూలై చివరివారంలో వర్షాలు కురవడంతో.. గోదావరి, కృష్ణా పరివాక ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలలో చెరువులు, కుంటల్లోకి నీరుచేరింది. కొన్ని జిల్లాలలో ఇప్పటీకి చెరువులు, కుంటలు, జలశయాల్లో నీరు చేరలేదు. నీళ్లున్న చెరువులు, కుంటల్లోనైనా చేప పిల్లల పంపిణీని ఎందుకు అమలుచేయడం లేదు? అని మత్స్యకార సహకార సొసైటీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.  

ఆలస్యమైతే.. 

రాష్ట్రంలోని 77 భారీ రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులతో పాటు 19,465 చిన్న నీటి చెరువల్లో చేపలు, రొయ్యలు పెంచుతున్నారు. అవి పెరిగి తర్వాత మత్స్యకారులు వాటిని పట్టుకుని విక్రయించి ఉపాధి పొందుతుంటారు. చేపల పెంపకం వృత్తిద్వారా దాదాపు 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రూ. 134.94 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మత్స్యశాఖ నుంచి గత నెలలోనే లేఖ రాశారు.

ముందుగా రూ. 116 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. మిగతా రూ. 18.94 కోట్లు టెండర్ల అనంతరం విడుద చేస్తామని పేర్కొన్నది. అయితే ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీ జరగకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చేపల పంపిణీ ఆలస్యం కావడంవల్ల.. చేపల పెరుగుదలలో తీవ్ర ప్రభావం ఉంటుందని, తద్వారా తమకు  నష్టం జరుగుతుందని మత్స్యకార సంఘాల సభ్యులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు