చర్లపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

11-11-2026 | 05:46pm

జగిత్యాల, నవంబర్ 11 ( విజయ క్రాంతి): జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(MLA Dr. Sanjay Kumar) శ్రీకారం చుట్టారు. 25 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్నిప్రారంభించారు. పంచాయతీ ఆవరణ లో మొక్కను నాటారు.

అనంతరం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రూ.3.50 లక్షల నిధులతో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.5 లక్షల చొప్పున నిర్మించనున్న మున్నూరు కాపు, రెడ్డి కుల సంఘ భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

10లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన దీటి లావణ్య–రాజయ్య, గడ్డం అంజయ్య ఈశ్వరి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చీరను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా లో మొదటి మ్యాజిక్ డ్రైన్ కు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు తో పేదల కళ్లలో ఆనందం కలిగిందన్నారు. మహిళ సంఘ భవనాల నిర్మాణానికి అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారికత కోసం కృషి చేస్తుందనీ, మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం తో గ్రామాల్లో కొత్తదనానికి నాంది పలికామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనందరెడ్డి, డి సీ సీ అధ్యక్షులు గాజంగి నందయ్య, ఏ ఎం సీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, ఎంపిడిఓ రమాదేవి, ఎమ్మార్వో హకీమ్, ఎం పి ఓ రవి బాబు,  డి ఈ మిలింద్, జిల్లా, మండల సర్పంచులు, బాల ముకుందం, ఏ ఈ విజయ్, గ్రామ, మండల నాయకులు, అధికారులు,  మహిళలు, కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు