జిల్లా మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
కేసముద్రం: టిఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభల ప్రచార పోస్టర్(Promotional poster) ను టిఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభలు మరిపెడలో భార్గవ ఫంక్షన్ హాల్లో డిసెంబర్ 6న జరుగుతాయని, ఈ మహాసభలో రాష్ట్ర విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, శాసనమండలి సభ్యులు తక్కలపల్లి రవీందర్రావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి,
ఉపాధ్యక్షులు చావ దుర్గా భావని, రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరౌతారన్నారు. రాష్టంలో ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం పై చర్చలు తీర్మాణాలు, భవిష్యత్తు కర్తవ్యాలపై నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. పీఆర్సి, సీపీఎస్ రద్దు ఓపిఎస్ అమలు చేయాలని లేనిచో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, మండల అధ్యక్షులు భూక్య శ్రీను ఉపాధ్యాయులు జయపాలరెడ్డి, సంపత్ రెడ్డి, రవీందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.