రాజ్యాంగం వల్లే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం

26-11-2026 | 06:53pm

తాడ్వాయి,నవంబర్,26( విజయ క్రాంతి ):భారత రాజ్యాంగం(Constitution of India) వల్లే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... రాజ్యాంగం భారతదేశానికి పునాది లాంటిదని తెలిపారు.

రాజ్యాంగం ఉండడంతోనే పేదలకు, అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు.భారతదేశ భవిష్యత్తు కోసం అంబేద్కర్ ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. దేశ సమగ్రత కోసం విద్యార్థులు పాటుపడాలని కోరారు.  అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజనీతి శాస్త్రం అధ్యాపకుడు వీరేశం ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీకాంత్, శ్రీనివాస్,సంతోష్, మల్లేశం,సరస్వతి, మనిషా,హారిక, సిబ్బంది సోటేరియా,నర్సయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు