మందమర్రిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

26-11-2026 | 06:55pm

మందమర్రి, (విజయక్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవం(Constitution Day of India) సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాది అని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు విధుల్లో పారదర్శకత, నిజాయితీ, సమానత్వాన్ని పాటిస్తూ హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, అధికారుల సంఘం జాయింట్ సెక్రటరీ రవి, డీజీఎం పర్సనల్ సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ కార్తీక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు