30 న పంచారామాల తీర్థాలకు యాత్ర బస్సు..

26-11-2026 | 07:06pm

ఖానాపూర్ (విజయ క్రాంతి): కార్తీక మాసం పురస్కరించుకొని ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో పంచరామాల క్షేత్రాల యాత్ర బస్సు(Pancharama Kshetras Pilgrimage Bus) నడుపున్నట్లు డిపోమేనేజర్ కల్పన తెలిపారు.

ఈ బస్సు నవంబర్ 30 తేదీన నిర్మల్ బస్టాండ్ నుండి మధ్యాన్నం 1:30 ని!! లకు బయలుదేరి డిసెంబర్ 2 ఉదయం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి లో గల ఒకటవ క్షేత్రం అమరా రామం దర్శించుకొని రెండవది భీమవరంలో గల సోమారామం దర్శించుకొని మూడవది పాలకొల్లు లో గల క్షీరారామం దర్శించుకొని నాలగవధి దక్షిణ కాశీ గా పిలిచే బీమేశ్వర ఆలయం ద్రాక్షారామం దర్శించుకొని చివరి ఐదవది సామర్ల కోట లోగాలా కుమార రామం దర్శించుకొని తిరిగి అదే రాత్రి బయలుదేరి డిసెంబర్ 2 వ తేదీ బుధవారం ఉదయం 5 గంటలకు నిర్మల్ చేరుకుంటుంది.

ఈ ఐదు క్షేత్రాలు కార్తీకమాసంలో అతిపవిత్రంగా భక్తులు దర్శించుకొంటారు.

ఈ టూర్ ప్యాకేజి రాను పోను ఒకరికి 3500/- ఉంటుందని ఆసక్తి కలవారు ముందుగా రిజర్వేషన్ చేసుకోవలసిందిగా తను తెలిపారు.

మరిన్ని వివరాలకు 9959226003, 9440018549 లో సంప్రదించాలని డిపోమేనేజర్ తెలిపారు.

మరిన్ని వార్తలు