సాధారణ ప్రసవాలు పెంచాలి
బైంసా (విజయక్రాంతి): గర్భిణులకు సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department) అధికారి డాక్టర్ రాజేందర్ సూచించారు. గురువారం జిల్లా లో వివిధ ఆస్పత్రులను తనిఖీ చేశారు. కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఆయన గర్భిణుల నమోదు కేంద్రాన్ని, సుఖ ప్రసవాల కోసం ఏర్పాటు చేసిన వ్యాయామ కేంద్రాన్ని పరిశీలించారు.
ప్రసవాల వివరాలను హెచ్ఓడీ డాక్టర్ సరోజ, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గర్భిణులతో మాట్లాడి సాధారణ ప్రసవాల ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిత, నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి, సీనియర్ నర్సింగ్ అధికారి జన, అధికారులు శ్రీకాంత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.