జిల్లా కోర్టులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
26-11-2026 | 06:58pm
భూపాలపల్లి, నవంబర్ 26 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో(Bhupalpally District Court) గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జె. జీవన్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పీఠికను పఠించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్, పరిపాలన అధికారి పారిజాతం, సూపరింటెండెంట్లు రఘురాం, సదానందం, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జీవన్ కుమార్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.