పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుంది
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి,నవంబర్ 4(విజయక్రాంతి ):పేదలకు తమ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందనీ తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Lakshman Kumar) స్పష్టం చేశారు.వెల్గటూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకం కింద 36 మంది లబ్ధిదారులకు సుమారు రూ.36 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 57 మంది లబ్ధిదారులకు సుమారు రూ.17 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాంపెల్లి శేఖర్, ఎంపీడివో పాడి వెంకట్ ప్రసాద్, గ్రామ సర్పంచులు బండమీది కవితగోపీ, దోరిశెట్టి మల్లేశం, భూపెల్లి