పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు
గండీడ్,(విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకుని మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల(Reddypalli Primary School)లో బాలసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఆర్. జనార్ధన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని,విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ టీచర్ శివశంకరమ్మ, ఉపాధ్యాయులు వెంకటయ్య, లక్ష్మయ్య, సరిత, వార్డు సభ్యులు పిట్ల నారాయణ, సుకన్య, ఆశా కార్యకర్త రామేశ్వరి, పిట్ల అంజిలయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.