నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో భక్తుల సందడి
వెంకటాపురం, నూగూరు,నవంబర్ 13, విజయ క్రాంతి: వెంకటాపురం మండలంలోని వివిధ గ్రామాల్లో నాగుల చవితి వేడుకలు(Nagula Chavithi Celebrations) భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్ష నాగుల చవితి సందర్భంగా మహిళలు, కుటుంబ సభ్యులు ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి పుట్టల వద్దకు చేరుకున్నారు. నాగేంద్రుడికి పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సంతాన సౌభాగ్యం కలగాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని నాగేంద్రుడిని వేడుకున్నారు. అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు సైతం పుట్టల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో పుట్టల వద్ద భక్తుల సందడి నెలకొం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగుల చవితి వేడుకలను భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు.