సమాచార హక్కు చట్టం అమలుపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం

27-11-2026 | 06:09pm

జగిత్యాల, నవంబర్ 27 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లాలో(Jagtial District) సమాచార హక్కు చట్టం(Right to Information Act)–2005 అమలు, విధివిధానాలపై మొదటి అప్పీలేట్ అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, ఉద్యోగులకు(Employees') రెండు రోజుల శిక్షణ కార్యక్రమం(Training Program) నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, సమాచార హక్కు చట్టం–2005 అమలులో భాగంగా రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRDI) ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టంలోని నిబంధనలు, దరఖాస్తుల స్వీకరణ, సమాచారం అందించే విధానం, అప్పీళ్ల పరిష్కారం, అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై శిక్షణ ను ఫాకల్టీ జీ.కిషన్  అందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలొ జిల్లా ఎంప్లాయి్మెంట్ అధికారి తిరుపతి రావు జగిత్యాలలోని పాత కలెక్టర్ కార్యాలయ భవనంలో ఉన్న ప్రాంతీయ శిక్షణ కేంద్రం, రూమ్ నంబర్ 214లో నిర్వహించారు.

మరిన్ని వార్తలు