జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

27-11-2026 | 06:00pm

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, నవంబర్ 27 (విజయ క్రాంతి): 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం శనివారం నిర్వహించే జవహర్‌ నవోదయ విద్యాలయ(Jawahar Navodaya Vidyalaya) ఎంపిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

జిల్లాలో రెండు కేంద్రాల్లో 399 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. భూపాలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో 234 మంది, కాటారం జెడ్పీహెచ్‌ఎస్‌లో 165 మంది హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో పోలీసు బందోబస్తు, వైద్య సదుపాయాలు, విద్యుత్, రవాణా తదితర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.

మరిన్ని వార్తలు