బోనాల కొండాపూర్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ
27-11-2026 | 05:44pm
చేగుంట, నవంబర్ 27: విజయక్రాంతి : చేగుంట మండలం(Chegunta Mandal) బోనాల కొండాపూర్ గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల(double bedroom house) లబ్ధిదారులకు(beneficiaries) పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(Dubbaka MLA Kotha Prabhakar Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా పీడీ, డిప్యూటీ ఈఈ, ఎమ్మార్వో తో పాటు సంబంధిత అధికారులు పాల్గొని లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు పట్టాలు అందడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.