బానోజీపేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్

27-11-2026 | 05:41pm

నిధుల దుర్వినియోగంపై డీఎల్‌పీఓ విచారణ

నర్సంపేట, నవంబర్ 27( విజయక్రాంతి ): గ్రామపంచాయతీ నిధుల వినియోగంలో(Utilization of Gram Panchayat Funds) అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో నర్సంపేట మండలం బానోజీపేట పంచాయతీ కార్యదర్శిని(Banojipeta Panchayat Secretary) ఉన్నతాధికారులు సస్పెండ్(Suspend) చేశారు. పంచాయతీకి మంజూరైన ప్రభుత్వ నిధులు(Government funds) పక్కదారి పడుతున్నాయని స్థానిక యువకుడు భూషబోయిన ప్రవీణ్ బృందం ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, లెక్కల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదిక సమర్పించడంతో కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పోరాడిన ప్రవీణ్ బృందాన్ని గ్రామస్థులు అభినందించారు.

మరిన్ని వార్తలు