బాల్యవివాహాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
* విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే వాటికి దూరంగా ఉండాలి
* బాల్యవివాహాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన
* విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దేవి మానస
కూసుమంచి, నవంబర్ 27(విజయక్రాంతి): బాల్యవివాహాలు(Child Marriages) బాలల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని, మాదకద్రవ్యాల వినియోగం(Drug use) యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి దేవి మానస(Judge Devi Manasa) అన్నారు. బాల్యవివాహాల నిర్మూలన(Eradication of Child Marriages), మాదకద్రవ్యాల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించి సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐడిఎన్జీవో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఖమ్మం(AIDNGO, District Department of Women and Child Welfare, Khammam) ఆధ్వర్యంలో సంయుక్తంగా గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దేవి మానస మాట్లాడుతూ చిన్న వయస్సులో వివాహాలు జరగడం వల్ల ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమవడంతో పాటు శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, సీడీపీఓ కవిత, తహసీల్దార్ సైదులు, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సాయి కుమార్, మండల విద్యాశాఖ అధికారి రాయల వీరస్వామి, ఉమెన్ హబ్ జిల్లా కోఆర్డినేటర్ సమ్రీన్, కే. సతీష్, ఏఐడీఎన్జీవో కోఆర్డినేటర్ కే. శ్రీనివాస్, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.