భాజపాలో పలువురు కాంగ్రెస్ నాయకుల చేరిక

27-11-2026 | 06:04pm

నల్లబెల్లి, నవంబర్ 27( విజయ క్రాంతి ): నల్లబెల్లి గ్రామానికి(Nallabelli village) చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు(Senior Congress leaders), ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోల లింగయ్యతో(Indiramma Committee member Kola Lingaiah) పాటు గాజుగోని రమేష్, గోగుల గోపాల్, గొట్టిముక్కుల కార్తీక్ చారి తదితరులు శుక్రవారం భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) (భాజపా)లో చేరారు. మండల అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు భాజపాలోకి వస్తున్నారని, పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు తడక అశోక్ గౌడ్, పెరుమాండ్ల కోటి, కొండ్లె రమేష్, సుదగాని ప్రమోద్, మురికి మనోహర్, ధర్మారం క్రాంతి కుమార్, ఓదెల అశోక్, తిమ్మాపురం శివ, పల్లె పర్వతాలు, కక్కర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు