నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు
నిర్మల్ నవంబర్ 27 ( విజయక్రాంతి) : జవహర్ నవోదయ విద్యాలయం సిర్పూర్ కాగజ్‌నగర్(Jawahar Navodaya Vidyalaya, Sirpur Kaghaznagar) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు(Entrance Examination) జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న(District Educational Officer Darshanam Bhojanna) శుక్రవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,737 మంది విద్యార్థులు(Students) పరీక్షకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ ఆధార్ కార్డు, హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్ పెన్నులు వెంట తెచ్చుకోవాలని సూచించారు.