జిల్లెల్ల వ్యవసాయ కళాశాలలో రేపు కిసాన్ మేళా
27-11-2026 | 06:04pm
తంగళ్ళపల్లి, నవంబర్ 27 (విజయ క్రాంతి ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో(Babu Jagjivan Ram Agricultural College) ఈ నెల 28న కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు పీడీ ఆత్మ తెలిపారు. ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ కిసాన్ మేళాలో వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలోని రైతు సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పీడీ ఆత్మ కోరారు.