గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మహిళకు అవకాశం కల్పించాలి
భూపాలపల్లి టౌన్, నవంబర్ 03 (విజయ క్రాంతి): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బహుజన మహిళకు అవకాశం కల్పించాలని సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర కమిటీ(Social Justice Forum State Committee) ప్రభుత్వాన్ని కోరింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు యేషబోయిన సాంబయ్య యాదవ్ మాట్లాడారు.
మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక జనాభా కలిగిన బహుజన మహిళకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు దామెరుప్పుల మధుస్వామి, బూర రమేష్ గౌడ్, దేవా నాయక్, బాణోతు రాజునాయక్, మల్యాల పెద్ద రవి, మాదిగ ముత్తోజు వీణాచారి, పసునూటి శంకర్, బత్తుల శ్రీధర్ యాదవ్, కె. శ్రీనివాస్ యాదవ్, ఎస్. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.