అనురాగ్ లో ‘కోడెక్స్–2026’ కోడింగ్ పోటీలు

03-11-2026 | 07:23pm

ఘట్ కేసర్, నవంబర్ 3 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐఎంఎల్) విభాగానికి చెందిన ‘కోడింగ్ కబ్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ‘కోడెక్స్–2026’ అంతర్ కళాశాల కోడింగ్, సమస్యల పరిష్కార పోటీలను నిర్వహించారు. విద్యార్థుల్లో కోడింగ్ నైపుణ్యాలను పెంపొందించడం, తార్కిక ఆలోచనా విధానాన్ని మెరుగుపరచడం, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ పోటీల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ పోటీల్లో ప్లే, డీబగ్, కాంకర్, కోడ్ అనే నాలుగు ఆసక్తికరమైన రౌండ్లను నిర్వహించారు. ఈ పోటీల్లో శ్రీనిధి, కేశవ్ మెమోరియల్, గీతం, ఏసీఈ, జేఎన్‌టీయూ తదితర కళాశాలలకు చెందిన 150 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ రౌండ్లలో విద్యార్థులు తమ కోడింగ్ నైపుణ్యాలు, తార్కిక ఆలోచన, సమస్యల పరిష్కార సామర్థ్యం, జట్టు సమన్వయాన్ని ప్రదర్శించారు. వివిధ కళాశాలల విద్యార్థులు ఒకే వేదికపై పోటీపడటంతో పాటు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకునే అవకాశం లభించింది. ఈ కార్యక్రమాన్ని ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ పి. పద్మిని చట్టు సమన్వయంతో, విద్యార్థి కోఆర్డినేటర్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

మరిన్ని వార్తలు