మంచిర్యాల జిల్లా కమిటీని బలోపేతం చేస్తూ నూతన నియామకాలు
జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మంచిర్యాల జిల్లా కమిటీలో నూతన నియామకాలు చేపట్టడం జరిగిందనీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మంగళ వారం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం, అధికారం కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పదవులు అనేవి అలంకారప్రాయంగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతలుగా భావించాలని, నూతనంగా నియమితులైన నాయకులందరూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మాదం రజిని కుమార్ సూచనలతో మంచిర్యాల జిల్లా కమిటీలో వివిధ బాధ్యతలను అప్పగిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.
నూతనంగా నియమితులైన వారు..
మంచిర్యాల జిల్లా కమిటీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా పుట్ట లావణ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులుగా తగరం రాజేష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులుగా వాసాల అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శిగా భీమిని రమేష్, జిల్లా కార్యదర్శిగా పడాల శివతేజ, రైతు విభాగం అధ్యక్షులుగా ఇప్ప కిషోర్, జిల్లా సలహాదారులుగా బూర రవీందర్ ని నియమించారు.