రవీందర్ సింగ్ వాక్యాల్ని ఖండించిన ఎంఐఎం యూత్ లీడర్ మెరాజోద్దీన్

03-11-2026 | 07:36pm

కొత్తపల్లి, నవంబర్ 03(విజయక్రాంతి): మాజీ మేయర్, బిఆర్ఎస్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్(BRS Corporator Sardar Ravinder Singh), అదాలత్ మస్జిద్ వక్ఫ్ భూమి అంశంపై మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) చిలుక పలుకుల వలె ఉన్నాయని ఎంఐఎం పార్టీ యూత్ లీడర్ మహమ్మద్ మేరాజోద్దీన్ ఎద్దేవా చేశారు. 

అదాలకు మస్జిద్ కు సంబంధించిన భూమి అంశంపై కార్పొరేటర్ రవీందర్ సింగ్ మాట్లాడిన వ్యాఖ్యలను ఒక పత్రిక ప్రకటనలో మంగళవారం మేరాజోద్దీన్ ఖండించారు. ప్రజల పన్నులతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదాలత్ మస్జీద్ భూమిని ప్రధాన కూరగాయల మార్కెట్ భూమిని కొనుగోలు చేసిందనే రవీందర్ సింగ్ అబద్ధపు విష ప్రచారాన్ని కొట్టిపారేశారు. రవీందర్ సింగ్ ఐదయేండ్లు  బిఆర్ఎస్ మేయర్ గా ఉన్నప్పుడు, ప్రజల పన్నులతో మార్కెట్ భూమి కొనుగోలు చేసిందనే, అప్పుడు ఆమాట ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రవీందర్ సింగ్ ఇద్దరు కలిసి కరీంనగర్ లో బిజెపిని బలోపేతం చేసేందుకు కపటనాటకం ఆడుతున్నారని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీ, హిందూ సమాజం ఓట్లు పొందడం కోసం చేస్తున్న కుటిల ప్రయత్నంలో భాగంగా మేము ముస్లింలకు వ్యతిరేకంగానే ఉన్నామనే మెసేజ్ హిందూ సమాజం దృష్టిలో పడేందుకు చేసిన కుట్రలో భాగంగానే మార్కెట్ అదాలత్ మస్జిద్ భూమి ఇప్పుడు తెరమీదకి తీసుకొచ్చారని విమర్శించారు.

గెజిట్ ప్రకారం మార్కెట్ కు సంబంధించిన రెండు ఎకరాలకు పైచిలుకు భూమి వక్ఫ్ బోర్డుదేనని చెప్పారు. ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ అంశం ఎందుకు తెర మీదికి తీసుకొచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రవీందర్ సింగ్, ఎమ్మెల్యే గంగుల ఇద్దరు కలిసి, కరీంనగర్ లో బీజేపీని అడ్డుకునే శక్తి మాకే ఉందని, మేమె మొనగాళ్లమని,

తీరా ఇప్పుడు అదే బిజెపి మేయర్ పీఠం కైవసం చేసుకుంటుంటే ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలన్నారు. ఉన్నత విద్యావంతుడు, న్యాయవాది, 6సార్లు కార్పొరేటర్, మేయర్, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన రవీందర్ సింగ్, అదాలత్ మస్జిద్ మార్కెట్ భూమి అంశం ఉల్కాపాతం జారిపడ్డట్లు, ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు