డిస్మిస్ కార్మికులకు ఉద్యోగావకాశాలు..

05-11-2026 | 07:31pm

భూపాలపల్లి టౌన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): సింగరేణిలో డిస్మిస్ కార్మికులకు(Dismissal of workers in Singareni) ఉద్యోగావకాశాలు కల్పించడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. భూపాలపల్లిలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో డిస్మిస్ కార్మికుల పునరుద్ధరణ అంశాన్ని చేర్చినట్లు తెలిపారు.

ఏఐటీయూసీ పోరాటం, సమ్మె నోటీసుల నేపథ్యంలో ప్రభుత్వం, యాజమాన్యం ఉద్యోగావకాశాలపై ఆదేశాలు జారీ చేశాయని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇతర సంఘాలు తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. 250 మంది కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, మెడికల్ బోర్డులను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాతంగి రామచందర్, గురిజపల్లి సుధాకర్ రెడ్డి, భీమనాధని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు