ఆరేళ్ల వార్డుల ప్రజలకు డ్రైనేజీ కష్టాలు
హైదరాబాద్ చౌరస్తా నుంచి నల్గొండ చౌరస్తా వరకు డ్రైనేజీ శుభ్రం చేయాలి – కౌన్సిలర్ జాలిగం విగ్నేష్
ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా(Hyderabad Crossroads) నుంచి నల్గొండ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన డ్రైనేజీలో(Main drainage) పేరుకుపోయిన మట్టి, చెత్తను వెంటనే తొలగించి డీసిల్టింగ్ పనులు చేపట్టాలని 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విగ్నేష్ మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు కమిషనర్‌కు(Commissioner) వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ.. సదరు డ్రైనేజీ 9, 22, 23, 24, 25, 26 వార్డుల పరిధిలో విస్తరించి ఉందని, గత కొన్ని సంవత్సరాలుగా శుభ్రపరిచే పనులు చేపట్టకపోవడంతో భారీగా మట్టి, చెత్త పేరుకుపోయిందన్నారు. దీంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించక పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దోమల బెడద పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యాన్‌పవర్‌ను ఏర్పాటు చేసి, వెంటనే డీసిల్టింగ్ పనులు చేపట్టాలని, డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టిని పూర్తిస్థాయిలో తొలగించాలని అధికారులను కోరారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని జాలిగం విగ్నేష్ విజ్ఞప్తి చేశారు.