మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

05-11-2026 | 07:02pm
  1. రేపు బీటీ నగర్, సిటీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
  2. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు అధికారుల సూచన

బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): బోధన్ పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ నీటి(Mission Bhagiratha water) సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. శుక్రవారం మిషన్ భగీరథ(Mission Bhagiratha) ద్వారా నీటి సరఫరా జరగనందున, నవంబర్ 06న బోధన్ పట్టణంలోని బీటీ నగర్, సిటీ కాలనీ, మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా నిలిచిపోనుంది.

ఈ అంతరాయం కారణంగా 15, 16, 17, 18, 28, 29, 30, 31, 32, 33వ వార్డుల పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరా ఉండదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కావున ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి, నీటి కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అవసరమైన నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. నీటి సరఫరా అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు