ప్రాథమిక విద్యకు అంగన్వాడీ కేంద్రాలు కీలకం

27-11-2026 | 05:17pm

సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 

3 వి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా అక్షరాభ్యాసం

గణపురం, నవంబర్ 27 (విజయ క్రాంతి): ప్రాథమిక విద్యకు(Primary Education) అంగన్వాడీ కేంద్రాలు(Anganwadi Centres) కీలకమని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం-3లో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని(Literacy program) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ పాల్గొని చిన్నారులతో అక్షరాలు దిద్దించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల(children) ప్రాథమిక విద్యకు అంగన్‌వాడీ కేంద్రాలు కీలక వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం విద్య, పౌష్టికాహారం, బాలల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. చిన్నారుల్లో చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించేందుకు అంగన్‌వాడీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పిల్లల ఇందిర, తల్లులు చిన్నారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు