పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలి
చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
సుల్తానాబాద్, నవంబర్ 27 (విజయ క్రాంతి): పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ(Sultanabad Municipal Chairman Birudu Radhakrishna) అన్నారు, శుక్రవారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మున్సిపల్(Sultanabad Municipal) పట్టణంలో ఒకటో వార్డు సుగ్లాoపల్లి లోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీలో అవార్డు కౌన్సిలర్ స్వరూప శేఖర్ తో కలిసి స్కూల్లో తనిఖీ చేయడం జరిగినది, అలాగే పిల్లలకు మంచి చదువుతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని టీచర్స్ కి సూచించడం జరిగినది, అలాగే పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చటించారు, మున్సిపల్ కమిషనర్ రమేష్ , అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.