విద్యార్థుల్లో రాజ్యాంగ అవగాహన పెంపొందించాలి
చత్రపతి యువజన సంఘం అధ్యక్షుడు అడ్లూరి శ్రీనివాస్
బోధన్, నవంబర్ 27 (విజయక్రాంతి): విద్యార్థుల్లో భారత రాజ్యాంగంపై(Constitution of India) అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని చత్రపతి యువజన సంఘం(Chhatrapati Youth Association) అధ్యక్షుడు అడ్లూరి శ్రీనివాస్ అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, బాధ్యతలు, విలువలను చిన్ననాటి నుంచే తెలుసుకోవాలని సూచించారు. శక్కర్నగర్లోని మధుమాలంచ హైస్కూల్లో(Madhumalancha High School) నిర్వహించిన రాజ్యాంగ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr. BR Ambedkar) చేసిన కృషి, ప్రాథమిక హక్కులు(Fundamental Rights), విధులు, ప్రజాస్వామ్య విలువల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వడ్నాల నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి రాజ్యాంగ విలువలను జీవితంలో పాటించాలని సూచించారు. రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అతిథి ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.