గౌతమ హైస్కూల్ లో ఆరోగ్యకరమైన ఆహారం
ఆనందమైన జీవితం కార్యక్రమము
జగిత్యాల, నవంబర్ 27 ( విజయ క్రాంతి ): ఆరోగ్యకరమైన ఆహారం(Healthy food) – ఆనందమైన జీవితం అనే సందేశంతో జగిత్యాల లోని విద్యానగర్ గౌతమ హైస్కూల్ లో(Gautama High School, Vidyanagar) విద్యార్థులు పలు రకాల ఆహార పదార్థాలను తయారు చేసే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా విద్యార్థులు మంటను ఉపయోగించకుండా వివిధ రకాల ఆహార పదార్థాలు, పానీయాలు తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. పండ్లు, కూరగాయలు, పోషక విలువలు కలిగిన పదార్థాలతో రూపొందించిన వంటకాలను అందంగా ప్రదర్శిస్తూ, వాటి తయారీ విధానం మరియు పోషక ప్రయోజనాలను వివరించారు.
పాఠశాల నిర్వాహకులు విద్యార్థుల చొరవ, సృజనాత్మకత, చక్కటి ప్రదర్శనను పేరెంట్స్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, జట్టు భావన మరియు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కంది కైలాసం, అన్నపూర్ణ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.