కొండగట్టు అంజన్నను దర్శించుకున్న విజయక్రాంతి చైర్మన్, ఎండీ

27-11-2026 | 07:09pm

యాదగిరి గుట్ట బోర్డు మెంబర్ విజయక్రాంతి చైర్మన్, ఎండి దంపతులకు సన్మానం

కొడిమ్యాల, నవంబర్ 27 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం(Choppadandi Constituency)లోని కొండగట్టు అంజన్న(Kondagattu Anjanna) నిజరూప దర్శనాన్ని పురస్కరించుకొని శుక్రవారం 'విజయక్రాంతి దినపత్రిక' చైర్మన్,ఎండి సీ.ఎల్ రాజం(C. L. Rajam), యాదగిరి గుట్ట బోర్డు డైరెక్టర్ విజయ(Vijaya) కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి,ఆశీర్వచనం  అందజేసి, ఆలయ ఏఈఓ హరినాథ్ చైర్మన్ దంపతులను సత్కరించారు. అనంతరం విజయక్రాంతి కరీంనగర్ బ్యూరో విజయసింహారావు, మేనేజర్ ఆంజనేయులు, కొడిమ్యాల రిపోర్టర్ కొండూరి సురేష్,కరీంనగర్ రిపోర్టర్ రామకృష్ణ,మల్యాల రిపోర్టర్ రమేష్ వారికి బోకే ఇచ్చి,శాలువా కప్పి సన్మానించారు.

మరిన్ని వార్తలు