నిజామాబాద్‌కు నేడు డీజీపీ సీవీ ఆనంద్

27-11-2026 | 07:11pm

పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకకు హాజరు

నూతన పోలీస్ సబ్ డివిజన్ ప్రారంభం

బోధన్, నవంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్(Telangana State DGP CV Anand) శనివారం నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District) పర్యటించనున్నారు. 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్(Telangana State Police Sports and Games Meet)-2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పోలీస్ క్రీడాకారులతో(Police players) సమావేశమై ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు.

అనంతరం డిచ్‌పల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన నూతన పోలీస్ సబ్ డివిజన్‌ను డీజీపీ ప్రారంభించనున్నారు. ఈ నూతన సబ్ డివిజన్ పరిధిలో డిచ్‌పల్లి(Dichpally), నిజామాబాద్ రూరల్, మోపాల్, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయి. నూతన సబ్ డివిజన్ ప్రారంభంతో ఆయా ప్రాంతాల్లో పోలీసు పరిపాలన మరింత సులభతరం కానుంది.

మరిన్ని వార్తలు