మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్
నేరేడుచర్ల, నవంబర్ 25(విజయ క్రాంతి): పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM SHRI Zilla Parishad High School) నేరేడుచర్ల విద్యార్థినీ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు బట్టు మధు నేతృత్వంలో ఇండస్ట్రియల్ టూర్ విజిట్లో భాగంగా మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ ) అవంతిపురం, మిర్యాలగూడను సందర్శించారు.
మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నందు వివిధ దశల్లో నీటి శుద్ధి విధాన ప్రక్రియ, భూగురుత్వాకర్షణ మూలాధారంగా పట్టణాలు, గ్రామాల్లో జనావాస ప్రాంతాలకు సరఫరా చేస్తున్న విధానం మరియు వాటర్ టెస్టింగ్ తదితర అంశాలపై ఇంజనీర్లు రమేష్, కనకారావు, రంజిత్, దినేష్ తదితరులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులు ఎంతో ఆసక్తితో అన్ని అంశాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు కె. వినీత, ఎం. వినోద్, ఉపాధ్యాయులు ఎం. సైదులు, ఏ. అన్నపూర్ణ, అష్రూన్, స్వప్న, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.