ఎన్నికల పట్ల నేటి యువత అవగాహన కలిగి ఉండాలి

13-11-2026 | 05:33pm

ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస, క్విజ్ పోటీలు 

భూపాలపల్లి టౌన్, నవంబర్ 13 ( విజయక్రాంతి ) : భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College, Bhupalpally) ఎలక్ట్రోరల్  లిటరసీ క్లబ్(Electoral Literacy Club) ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఏ రమణారావు అధ్యక్షతన కళాశాల విద్యార్థులకు ఉపన్యాస, క్విజ్ పోటీలు(Speech and Quiz Competitions) నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా నేటి యువత బాధ్యత వహించాలని, ఎన్నికల పట్ల అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్ రామచంద్రం, జె హనుము, బి శ్రీనివాస్ పాల్గొన్నారు

మరిన్ని వార్తలు