ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
తాడ్వాయి,నవంబర్,13( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ బాలల దినోత్సవం(National Children's Day) సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం(Self-Governance Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థిని, విద్యార్థులు చాత్రోపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు.
చాత్రోపాధ్యాయులుగా మారిన విద్యార్థులు ఉపాధ్యాయుడి అనుభవాన్ని వివరించారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఛాత్రోపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు రామస్వామి బహుమతులు అందించారు. ప్రధానోపాధ్యాయులుగా రిషివర్ధన్,పీటీగా సృజన్ కుమార్,అటెండర్ గా రాఘవ వ్యవహరించారు. విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చాంద్ పాషా బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ హేమలత, ఉపాధ్యాయులు గిరి, నీల,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.