సీపీఎస్ రద్దు కోసం సామూహిక సెలవు
13-11-2026 | 05:09pm
జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహారావు.
ఊర్కొండ, నవంబర్ 13: సీపీఎస్‌ను రద్దు(Abolition of CPS) చేసి పాత పెన్షన్ విధానాన్ని(Old Pension System) (ఓపీఎస్) పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు.
నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు చేపట్టనున్న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఊర్కొండలో ఉపాధ్యాయులు శుక్రవారం ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆనంద్ కుమార్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.