శుభకార్యాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు

13-11-2026 | 05:22pm

గణపురం, నవంబర్ 13 (విజయక్రాంతి): మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలోని(Appayyapalli Village) వివిధ శుభకార్యాల్లో బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders) పాల్గొని  ఆశీర్వదించారు. తొట్ల రజిత,సాంబయ్య దంపతుల ఏకైక కుమార్తె వర్షిత, కిరణ్ యాదవ్‌ల వివాహ మహోత్సవానికి, అలాగే పిల్లి శ్రీలత,రాజు దంపతుల ఏకైక కుమార్తె రవళిక నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి(Mothe Karunakar Reddy) హాజరై నూతన వధూవరులను, చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ ఎంపీటీసీ మందల అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఐలోని శశిరేఖ రామచంద్రారెడ్డి, నగరంపల్లి సర్పంచ్ కొడాలి హైమా ధనంజయ్, మాజీ ఉపసర్పంచ్ పల్లెవేని సదయ్య, డాక్టర్ పాశం నాగరాజు,  వంగ రాజు, నోముల సాంబయ్య, ఎలుకపెల్లి దేవేందర్, భాషావేణి నాగరాజు, ఎడబోయిన దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు