అయ్యప్ప టెంపుల్ వద్ద నాగుల పంచమి పూజలు

13-11-2026 | 05:15pm

మహదేవపూర్. నవంబర్ 13.(విజయక్రాంతి ): నాగుల పంచమి(Nagula Panchami) పర్వదినాన్ని పురస్కరించుకుని మహదేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అయ్యప్ప టెంపుల్  వద్ద నాగదేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హసీనాభాను, ఉప సర్పంచ్ శ్రీజా, పంచాయతీ కార్యదర్శి కల్పన మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నాగదేవతల కృపతో గ్రామం పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. సంప్రదాయాలను, ఆచారాలను కాపాడుకుంటూ గ్రామ అభివృద్ధికి పాలకవర్గం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు