ఎయిడ్స్ నివారణలో ‘సురక్షిత్’ స్థాయి సాధన అభినందనీయం
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, నవంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(Telangana State AIDS Control Society), జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎయిడ్స్ నివారణ కార్యక్రమంలో(AIDS Prevention Program) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ‘సురక్షిత్’ స్థాయి సాధించడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ను రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉప సంచాలకురాలు ఇందిరా ప్రియదర్శిని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సత్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ పరీక్షలు, చికిత్స, వైరల్ లోడ్ పరీక్షలు, గర్భిణులకు పరీక్షలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. 95-95-95 లక్ష్యాల సాధనతో పాటు ‘సురక్షిత్ ప్లస్’ స్థాయికి చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్, దిశా జిల్లా నిర్వాహకురాలు జ్యోతి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.