22న ఉద్యమకారుల ఛలో మేడారం
కేసముద్రం: తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం(Telangana Activists Forum) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 22న ములుగు జిల్లా(Mulugu District) మేడారంలో జరగబోయే పాదయాత్ర కార్యక్రమం, సమావేశం జయప్రదం చేయాలని కేసముద్రం(Kesamudram) తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం అధ్యక్షుడు చాగంటి కిషన్ పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ లో చలో మేడారం ప్రచార వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జే ఏ సీ పూర్వ కన్వీనర్ మోడెమ్ రవీందర్ గౌడ్, విద్యార్థి, యువజన జే ఏ సీ పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, మంద భాస్కర్, బాల్ మోహన్, సోమారపు వెంకటయ్య, గండ్ల మలేందర్, బాబు. యకాంతం, బ్రహ్మ చారి, తరాల విజయ్ కుమార్, రామ్మూర్తి పాల్గొన్నారు.