అంగన్‌వాడీ టీచర్ భర్తీ

20-11-2026 | 10:50pm

మౌఖిక ఇంటర్వ్యూలు ముగింపు

జగిత్యాల, నవంబర్ 20 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లాలో(Jagtial District) మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న 64 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ(Recruitment for Anganwadi teacher posts) ప్రక్రియలో భాగంగా మూడు రోజుల పాటు నిర్వహించిన మౌఖిక ఇంటర్వ్యూలు(Oral interviews) శుక్రవారంతో ముగిశాయి. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (IDOC), జగిత్యాలలో జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించబడ్డాయి.

ఈ ఇంటర్వ్యూలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 557 మంది అర్హులైన అభ్యర్థులకు(candidates) అవకాశం కల్పించగా, వారిలో 515 మంది అభ్యర్థులు హాజరై మౌఖిక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. మిగిలిన 42 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.

అంగన్‌వాడీ టీచర్ పోస్టుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ జిల్లా ఎంపిక కమిటీ పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పి. మధుసూదన్, కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్. జీవాకర్ రెడ్డి, మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి  జి. నరసింహారావు, జిల్లా సంక్షేమ అధికారి ఎ. భాస్కర్, జిల్లా వైద్య - ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, సంబంధిత అధికారులు  అభ్యర్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు