తాడిచర్ల, చిన్న కాళేశ్వరం భూసేకరణ వేగవంతం చేయాలి

04-11-2026 | 07:00pm

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, నవంబర్ 4 (విజయ క్రాంతి): తాడిచర్ల డేంజర్ జోన్ పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) భూసేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma ) అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలో జెన్‌కో, రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తాడిచర్లలో అర్హులైన ఇళ్లను గుర్తించి రికార్డులను పరిశీలించాలని, ఆర్‌ఎన్‌ఆర్, భూసేకరణ, అవార్డుల ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించి ప్రజలకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఇళ్ల వివరాలను డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. చిన్న కాళేశ్వరం భూసేకరణలో పెండింగ్ అవార్డులు, మ్యుటేషన్లు, టైటిల్ వివాదాలు,

ప్రతిపాదనలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, జెన్‌కో సీఈ శ్రీ ప్రకాష్, రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు