ముస్లింల విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ఎంఐఎం కృషి

04-11-2026 | 07:54pm

బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ కృషితోనే మైనారిటీ గురుకులాల అంకురార్పణ

సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

మానకొండూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎంఐఎం పార్టీ విశేషంగా కృషి చేస్తుందని నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్(MLA Majid Hussain) అన్నారు. బుధవారం మానకొండూర్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2026 గైడ్స్ ను, ఎస్సెస్సీ చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. 8,9, 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, నోట్ బుక్స్ అందజేశారు.

సిరిసిల్ల, గంభీరావుపేట, వేములవాడ ఎంఐఎం పార్టీ ప్రతినిధులకు, ఆయా ప్రాంతాల్లో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు గైడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ముఖ్యంగా బాల, బాలికలు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జీవితంలో పదవ తరగతి వార్షిక పరీక్ష కీలకమని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడానికి సాలారే మిల్లత్ గైడ్ దోహదపడుతుందని అన్నారు.

మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో గత 26 సంవత్సరాల క్రితం ఆల్ ఇన్ వన్ గైడ్లను ఎంఐఎం పార్టీ తరఫున ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందజేస్తున్నట్లు, సాలారే మిల్లత్ తర్వాత, తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉర్దూను బ్రతికించడం కోసం ఉర్దూ మీడియం పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, ముస్లింల విద్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో కలిసికట్టుగా అనేకమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం దారుస్సలాం ఏర్పాటు చేసి, ప్రజా సమస్యల ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి దారి చూపడం అభినందనీయమన్నారు. ఎంఐఎం పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ చేస్తున్న ప్రజా సేవలను స్ఫూర్తిగా తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీల సారథ్యంలో.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా పేద ముస్లింల పిల్లలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో కార్పొరేట్ స్థాయిలో 20 పాఠశాలలను స్థాపించి, 20వేల మంది విద్యార్థులకు ప్రతి ఏటా విద్యను ఉచితంగా అందిస్తున్న ఘనత వీరికి దక్కుతుందన్నారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ, అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్, అబ్దుల్ గఫ్ఫార్, మెరాజోద్దీన్, అబ్దుల్లా ఖాన్, ఫసియుద్దీన్ ఖాలీద్, షాకిర్ నహ్ది, సిరిసిల్ల నాయకులు పర్వేజ్, ముస్తఫా, ఇర్ఫాన్ ఖాన్, మానకొండూర్ మస్జిద్ మాజీ అధ్యక్షుడు సిరాజుద్దీన్ పాషా, ఖమరొద్దీన్ షబ్బీర్, ఎజాజ్ ఖురేషీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు