నీటి నిల్వ పనులకు ప్రజలు అధిక ప్రాధాన్యతనివ్వాలి
సర్పంచ్ దున్నా శ్రీనివాస్.
కోదాడ నవంబర్ 04(విజయ క్రాంతి): ప్రభుత్వం చేపడుతున్న నీటి నిల్వ పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ రైతులు, ప్రజలు సహకరించాలని గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ కోరారు.బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో జల సంరక్షణ కుంట(Water conservation pond) పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం చేపడుతున్న నీటి నిల్వ పనులు జల సంరక్షణ కుంటలు,పంట కుంటలు,నీటి కుంటలు,బోర్ వెల్ రీఛార్జి, ఇంకుడు గుంతలు నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి,టెక్నికల్ అసిస్టెంట్ అంజిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, ఉపాధి కూలీలు జలీల్, వెంకన్న,శ్రీలేఖ, లింగయ్య,లక్ష్మి సుజాత,కళ్యాణి,మాధవి, రజిని,విజయమ్మ పాల్గొన్నారు.