ఎల్ నినో ప్రభావం పై అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర నవంబర్ 4 విజయ క్రాంతి: దేవరకద్ర నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో(Constituency Camp Office) బుధవారం అన్ని శాఖల అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం ఎమ్మెల్యే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం 'ప్రజా పాలన' సూత్రంతో ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తోంది.
రానున్న రోజుల్లో నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, రైతన్నలకు నష్టం వాటిల్లకుండా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాము అని తెలిపారు. అలాగే కూలీల వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని స్పష్టం చేశారు.
వ్యవసాయం, విద్యుత్, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.